Reading Time: 2 minutes
Actress : బట్టల దుకాణంలో పనిచేసిన అమ్మాయి.. కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ చిత్రంతో హీరోయిన్ కయాదు లోహర్ మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తమిళం, తెలుగు చిత్రసీమలలో చాలా బిజీగా ఉంది. ఇటీవల ఆమె సాయి అభయంకతో కలిసి ‘పవళ్ మళ్ళీ’ అనే పాటలో డ్యాన్స్ చేసింది. ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు తెలుగులోనూ బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో, చిత్రసీమలోకి రాకముందు తాను చేసిన ఉద్యోగాల గురించి కయాదు లోహర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తాను బట్టల దుకాణం నుండి స్టార్‌బక్స్ వరకు చాలా చోట్ల పనిచేశానని, తనకు ల్యాప్‌టాప్‌ను సరిగ్గా ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని ఆమె చెప్పింది.

ఎక్కువ మంది చదివినవి : Sri Sri: ఆ హీరో నా ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చారు.. శ్రీశ్రీ కామెంట్స్ వైరల్..

ఈ విషయం గురించి మాట్లాడుతూ “సినిమా రంగంలోకి రాకముందు నేను చాలా పనులు చేశాను. స్టార్‌బక్స్‌లో, ఒక బట్టల దుకాణంలో పనిచేశాను. చాలా ఐటీ కంపెనీలలో కూడా పనిచేశాను. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాకు ల్యాప్‌టాప్‌ను సరిగ్గా ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఐటీ కంపెనీలలో కూడా, నేను కేవలం శిక్షణ సమయంలో మాత్రమే పనిచేశాను,” అని ఆమె చెప్పారు. ఇలాంటి ఎన్నో కష్టాల తర్వాతే తాను నటిగా అడుగుపెట్టానని కయాదు లోహర్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

నటి కయాదు లోహర్, టోవినో థామస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పల్లిచట్టంబి’ చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి తిరిగి వస్తున్నారు. డిజె జోస్ ఆంటోనీ దర్శకత్వంలో, టోవినో థామస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పల్లిచట్టంబి’ టీజర్ ఇటీవల విడుదలైంది. అంతకుముందు విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందాయి. తెలుగులో చివరగా విశ్వక్ సేన్ సరసన ఫంకీ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి కెవి అనుదీప్ దర్శకత్వం వహించారు. మంచి హైప్ అందుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది కయాదు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

 

View this post on Instagram

 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..