Reading Time: < 1 minute

ఉరి వేసుకుని ఫిజియోథెరపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.  సాయిబాబా నగర్ లో నివాసముండే బత్తిని అనిత (29) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అనిత మల్లారెడ్డి ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్ట్ గా పని చేస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.