Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులు మీరే అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రూప్-1 అధికారులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని అన్నారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును సిఎం స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.