
హరారే: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. అఫ్గానిస్థాన్‌ని చిత్తుగా ఓడించి ఫైనల్స్‌కి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో భారత ప్లేయర్లు ఏ మాత్రం తడబడకుండా దంచికొట్టారు. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆరోన్ జార్జి మాత్రం అప్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 115 చేసి ఆరోన్ ఔట్ అయ్యాడు. మొత్తానికి భారత్ 41.1 ఓవర్లలో 311 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్స్‌తో భారత్, ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తలపడనుంది.