Reading Time: < 1 minute

 రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియుజికెవై) సహకారంతో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన యువతీ, యువకులకు మూడు నెలల కాలపరిమితితో డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర). ఎకౌంట్స్ అసిసెంట్‌ట్యాలీలో ఉపాధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్‌రెడ్డి బుధవారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని, అడ్మిషన్లకు చివరి తేదీగా ఫిబ్రవరి 16 (సోమవారం)గా నిర్ణయించామన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో చేరాలనుకునే అర్హత కలిగిన యువతీ,

యువకులు అడ్మిషన్ల కోసం ఫోన్ నెంబర్లు : 9133908000, 9133908111, 9133908222. 9948466111లో సంప్రదించాలని కోరారు. అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫోటోలు తీసుకురావాల్సి ఉందన్నారు. దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ నుండి బస్ నెంబర్:524 ద్వారా సంస్థకు చేరుకోవచ్చని, అదే విధంగా సమీప రైల్వేస్టేషన్లు బీబీనగర్, భువనగిరి, సికింద్రాబాద్‌ల నుంచి సంస్థకు చేరుకోవచ్చని వెల్లడించారు. డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర)కు ఇంటర్ పాస్, ఎకౌంట్స్ అసిస్టెంట్‌ట్యాలీకి బి.కామ్ విద్యార్హతను విద్యార్థులు కలిగి ఉండాలన్నారు.