
సంక్రాంతి పండగ తర్వాత కూడా రైతు భరోసా పడకపోవడంతో తెలంగాణ రైతులు నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం గూడూరులో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం కావాల్సిన 9వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసుకునే పనిలో ప్రభుత్వ ఉన్నట్లు చెప్పారు.
అయితే, బిఆర్ఎస్ మాత్రం, సిఎం రేవంత్ రెడ్డి.. రైతులను మోసం చేస్తున్నారని విమర్శిస్తోంది. డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను.. సంక్రాంతికి ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి రైతులను మోసం చేస్తోందని బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.