Reading Time: < 1 minute

లంచం తీసుకుంటు విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్ బుధవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నగరంలోని బండ్లగూడ డిప్యూటీ విద్యాశాఖ కార్యాలయంలో శివప్రసాద్ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలోని పదోతరగతి పరీక్షల సెంటర్‌ను తొలగించకుండా ఉండాలంటే రూ.10,000లు ఇవ్వాలని శివప్రసాద్ డిమాండ్ చేశాడు. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చింది. ఎసిబి అధికారుల సూచనల మేరకు శివప్రసాద్‌కు రూ.10,000 ఇస్తుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.