
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గతేడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఒజి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో వీరమల్లు నిరాశపరిచినా.. ఒజి మంచి సక్సెస్‌ని సాధించింది. కాగా, పవన్ నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకుడు. ‘గబ్బర్‌సింగ్’ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తగిన ఫలితం వచ్చింది. ఉస్తాద్ విడుదల తేదీని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వేసవి కానుకగా అంటే మార్చి 26న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధిచి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని కూడా వదిలింది. ఈ పోస్టర్‌లో పవన్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని పవన్ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.