విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్ష వర్థన్(36) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆయన ప్రాణాలు విడిచారు.హర్షవర్ధన్ బుధవారం ఉదయం తన నివాసం నుంచి ఒక సూసైడ్ నోట్ రాసి బయటకు వెళ్లారు.ఆయన కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తుండగానే దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం అందింది.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హర్షవర్ధన్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.