Reading Time: < 1 minute

బడ్జెట్‌పై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు.బడ్జెట్‌లో ఉన్న లోపాలను పాయింట్ల వారీగా, గణాంకాలతో సహా నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. కేవలం రాజకీయ ప్రసంగాలు చేయడం కాకుండా, బడ్జెట్‌లోని ఏ కేటాయింపులు తప్పుగా ఉన్నాయో లేదా ఏ రంగానికి అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ గణాంకాలపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.దేశంలో అభివృద్ది చెందుతున్న కార్మిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి వ్యవసాయం గ్రామీణ ఉపాధి , యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం యువత నైపుణ్యం , వ్యవస్థాపకత , కృతిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బడ్జెట్ లో ప్రధానంగా దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.