Reading Time: < 1 minute

నవీ ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌ని 4-1 తేడాతో కైవసం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్‌ని చాలా కీలకంగా భావిస్తోంది. ఈ మ్యాచ్‌తోనే ఇరు జట్ల బలాబలాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో చేసే ప్రయోగాలు అసలు టోర్నమెంట్‌లో ఉపయోగపడతాయి. ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.