
మెగా అభిమానులకు ఈ సమ్మర్ పండగనే చెప్పాలి.. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇందులో ముందుగా పవన్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో విడుదల కాబోతోంది. తర్వాత ‘పెద్ది’.. ‘విశ్వంభర’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’… పవన్ కల్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం. ఇప్పటికే విడుదల టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుత షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్.. పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది.
బుధవారం మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ అదిరిపోయే పోస్టర్ ను వదిలారు. ఇందులో పవన్ ఎంతో స్టైలీష్ గా ఉన్నాడు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో తెలిపారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘ఓజి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి అదే రిపీట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.
మరోవైపు, మార్చి 26న వస్తుందనుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక, జూన్ 9న చిరు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘విశ్వంభర’ను రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.