Reading Time: < 1 minute

హరారే: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారీ స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే తొలి వికెట్‌కి ఉస్మాన్ సాదత్, ఖలీద్ అహ్మద్‌జాయ్ 53 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని దీపేశ్ బ్రేక్ చేశారు. దీపేశ్ బౌలివంగ్‌ో ఖలీద్(31) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఫైజల్ షినోజాదా క్రీజ్‌లో పాతుకుపోయాడు.

ఉస్మాన్(39) ఔట్ కావడంతో ఉజైరుల్లా నియాజైతో కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. 93 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఉజైరుల్లా నియాజై కూడా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 101 పరుగులు చేశాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో కనిష్క్, దీపేశ్ చెరి రెండు వికెట్లు తీశారు.