
సోషల్‌మీడియా వాడకం ఎంత మంచి చేస్తుందో.. దాని వల్ల అంతే చెడు కూడా జరుగుతోంది. ప్రపంచంలో ఎప్పుడూ.. ఏం జరుగుతుందో సోషల్‌మీడియాలో క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక మనకు ఇష్టమైన సెలబ్రిటీలను ఫాలో అవుతూ.. వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోవచ్చు. అయితే దీన్ని కొందరు మంచి కోసం ఉపయోగిస్తే.. ఇంకొందరు మాత్రం చెడు మార్గంలో వాడుతారు. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలకు ఇలాంటి వారితో సమస్యలు వస్తుంటాయి. తాజాగా తెలుగమ్మాయి. నటి ఈషా రెబ్బాకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తనపై సోషల్‌మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఈషా పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈషా పెట్టిన పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ పెట్టాడు. దీంతో అతడి ఐడితో పాటు కామెంట్‌ను పోలీసులకు చూపించి యాక్షన్ తీసుకోవాలని కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా అసభ్యకరంగా కామెంట్లు పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా ఈషా.. తరుణ్ భాస్కర్‌తో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాలో నటించింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది.