
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. స్వప్నఅనే న్యాయవాదిని ఆమె సోదరుడు కత్తి నరికి చంపాడు. స్వప్న(34) అనే న్యాయవాది చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వప్న మెడపై సోదరుడు కత్తితో దాడి చేసి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.