
హైదరాబాద్: భాగ్యనగరంలోని సంజీవ రెడ్డి నగర్ లోని దాసరం బస్తీలో భూవివాదం జరిగింది. నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణానికి బిల్డర్ యత్నించారు. దారి లేకుండా చేస్తున్నారని బస్తీ వాసులు తిరగబడ్డారు. బిల్డర్‌కు మద్దతుగా పాత బస్తీ బౌన్సర్లు రంగంలోకి దిగారు. బస్తీ వాసులపై రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 35 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని స్థానికులు తెలిపారు. కూలి పనులు చేస్తూ బతుకుతున్నామని వెళ్లేది లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. భూవివాదానికి సంబంధదించి అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.