Reading Time: < 1 minute

హైదరాబాద్: భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదనే సాకుతో టి20 వరల్డ్ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసిసి ఎంపిక చేసింది. బంగ్లాదేశ్‌కు పాక్ మద్దుతు తెలపడంతో పాటు టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్‌ను పిసిబి చంపేస్తోందని, ఆ దేశపు ప్రగతికి దోహపడదన్నారు. వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడం మంచిది కాదని హితువు పలికారు. పాకిస్థాన్ నుంచి అద్భుతమైన క్రికెటర్లు వచ్చారని, వారిని వరల్డ్ కప్‌లో అడ్డుకోవడం మంచిది కాదన్నారు. సొంత ఆటగాళ్లకే  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశపు రాజకీయాలు అన్యాయం చేస్తున్నాయని కపిల్ దేవ్ మండిపడ్డారు. ఫిబ్రవరి 15న కోలంబో వేదికగా భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ స్టేజీలో భారత్‌తో మ్యాచ్ ఆడకుంటే పాక్ రన్‌రేటు తగ్గుతోంది. పాయింట్లు భారత్ కు రావడంతో ముందు స్థానంలోకి వెళ్లిపోతుంది. టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడుకుంటే ఆ దేశపు క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది.