Reading Time: < 1 minute

ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో పులి సంచరిస్తోంది. సారాజిపేట గ్రామంలో ఆవుపై పులి దాడి చేసి చంపింది. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అని భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రైతులు ఒంటరిగా చేనులు, పొలంలో వెళ్లొద్దని సారాజిపేట గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.