Reading Time: < 1 minute

రాయ్‌పూర్: ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని ప్రియురాలు కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుభమ్ విహార్ టీచర్స్ కాలనీలో ప్రసాద్ సూర్యవంశీ(25) అనే యువకుడు ఓ హోటల్‌లో పని చేసేవాడు. అతడి సోషల్ మీడియాలో యువతి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు ప్రతీ రోజు ఫోన్లలో చాటింగ్ చేసుకునేవారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె నంబర్‌ను అతడు బ్లాక్ చేశాడు. దీంతో ప్రియురాలు అతడి రూమ్‌కు వెళ్లి తన నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని ప్రశ్నించింది. మొబైల్‌లో చాటింగ్ చూపించాలని పట్టుబడడంతో అతడు నిరాకరించాడు. కోపంతో రగిలిపోయిన యువతి కత్తి తీసుకొని అతడిని పలుమార్లు పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.