Reading Time: < 1 minute

బెంగళూరు: తల్లిని తీసుకెళ్లిన ప్రియుడ్ని కత్తితో నరికి ఛాతీపై కాలు పెట్టి నిలబడి ఫొటో తీసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని సవదత్తి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బసడోణి గ్రామానికి చెందిన బసప్ప అనే వ్యక్తి పది సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో మహారాష్ట్రాలోని కొల్హాపూరకు పారిపోయాడు. నాలుగు రోజుల క్రితం బసప్ప తన సొంత గ్రామానికి వచ్చాడు. సదరు వివాహిత కుమారుడు ఈరయ్య మతపాటి తన తల్లి ప్రియుడు బసప్పను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి హూళీ కట్టి గ్రామ సమీపంలో  బసప్పపై కత్తితో దాడి చేశాడు. కిందపడిపోయిన వెంటనే కత్తితో 16 సార్లు పొడిచి హత్య చేసి ఛాతీ మీద నిలబడి ఈరయ్య సెల్ఫీ తీసుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడు లొంగిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.