Reading Time: 2 minutes

 టిజిఓ, టిఎన్జీఓ నేతల ఎడమొహం, పెడమొహం వాట్సాప్ గ్రూపు నుంచి

టిఎన్జీఓ సంఘం ఎగ్జిట్ రెండు నెలలుగా సమావేశం కాని జేఏసి నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల జేఏసిలో (టిజిఈజేఏసీ) చీలిక రావడంతో ఉ ద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జేఏసి లో ముఖ్య సంఘాలైన టిజిఓ, టిఎన్జీఓల మధ్య వి భేదాలు ముదరడంతో ఈ జేఏసిలో చీలిక తప్పదని ఉద్యోగసంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇ ప్పటికే ఈ రెండు సంఘాల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ జేఏసీలోని మిగతా సంఘాలు నాయకులు కూడా వీరిద్దరిని క లపడానికి ప్రయత్నించడం లేదని దీంతో వీరి మ ధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సంఘాల మధ్య మనస్పర్ధల నేపథ్యంలో ఈ జేఏసి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా టిజిఓ, టిఎన్జీఓల ఆధిపత్య పోరు అధికం కావడంతో ఈ మధ్య జేఏసి వాట్సాప్ గ్రూపు నుంచి టిఎన్జీఓ సంఘం నాయకులు ఎగ్జిట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ రెండు సంఘాల నాయకులు అంటీముట్టనట్టుగా వ్యవహారించడంతో పాటు కనీసం జేఏసి సమావేశాన్ని సైతం నిర్వహించ లేదు. అయితే, ఈ విషయమై ఇరు సంఘాల నాయకులు ఉద్యోగులకు వేర్వేరు కారణాలు చెబుతుండడంతో అసలు తప్పు ఎవరిది, ఎందుకు వీరి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యిందన్న విషయాల గురించి ఉద్యోగులు ఆరా తీస్తున్నారు.

206 సంఘాలతో జేఏసి స్టీరింగ్ కమిటీ

అయితే టిజిఓ, టిఎన్జీఓ సంఘాల నాయకులు (టిజిఈజేఏసీ) పేరుతో ఉద్యోగుల జేఏసిని ఏర్పాటు చేయడం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేక వీరి మధ్య రాజకీయ నాయకులే చిచ్చు పెట్టారని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. 206 సంఘాలతో తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయగా ఈ జేఏసి చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏ లూరి శ్రీనివాసరావులను ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకున్నారు. ఈ జేఏసి స్టీరింగ్ కమిటీలో 27 ఉద్యోగ సంఘాల నాయకులకు సైతం చోటు కల్పించారు. అయితే, ఈ జేఏసిలో ప్రభుత్వ గుర్తింపుపొందిన 9 ఉద్యోగ సంఘాలైన టిఎన్జీఓ, టిజిఓ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టిఆర్‌టి యూ, యూటిఎఫ్, ఎస్‌టియూ, టిఆర్‌టిఎఫ్ సం ఘాలతో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాలైన ఈఎస్‌పిసి, టిటిజేసి, జాక్టో, టిఏజేఏసి తదితర సంఘాలు ఇందులో భాగస్వామయ్యా యి. వీటితో పాటు పెన్షనర్‌ల సంఘాలు సైతం ఈ జేఏసికే మద్ధతు ప్రకటించాయి. దీంతో ఈ జేఏసికి సుమారుగా 206 ఉద్యోగ సంఘాలు మద్ధతు ప్రకటించడంతో మొత్తంగా 3 లక్షల ఉద్యోగులతో పాటు 3,50,000 లక్షల పెన్షనర్‌ల మద్ధతు ల భించింది. అయితే, ఈ జేఏసిలో మొదటి నుంచి ఒ క నాయకుడంటే మరో నాయకుడికి గిట్టడం లేదు. జేఏసిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే దానిని లీక్ చేస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విశేషం. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ సం ఘాలతో జేఏసిని ఏర్పాటు చేసుకొని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంలో సఫలీకృత మయ్యాయి. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సుమారు 10 ఏళ్ల పాటు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వానికి టిఎన్జీఓ, టిజిఓ, రెవెన్యూ, టీచర్ల సంఘాలు పలుమార్లు వినతిపత్రాలను ఇచ్చి కొంతమేర తమ సమస్యలను పరిష్కరించుకున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రం లో డిసెంబర్ 2023న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సిఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్యోగ సంఘాల నాయకులు మారిపోవడంతో కొత్తగా 206 ఉద్యోగ సంఘాలతో ఈ జేఏసిని ఏర్పాటు చేసుకొని సమస్యల సాధన కోసం పోరాడుతున్నాయి.