
న్యూఢిల్లీ: భారతదేశం – అమెరికా వాణిజ్య ఒప్పందంలో దేశ ప్రయోజనాలే కీలకం అని, ఇది దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే గొప్ప ఒ ప్పందం అని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నాడు వెల్లడించారు. ఎ న్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ ప్రకటన చేయగానే ఎం పీలు అంతా హర్షామోదాలతో ఆమోదించారు. కొద్ది రోజుల వ్యవధిలో అ టుయురోపియన్ యూనియన్, ఇటు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నందుకు ఎన్డీఏ సంకీర్ణ సభ్యులు ప్రధాని మోదీని అభినందించారు. ఈ ఒప్పందాలు భారతదేశంలో తయారీదారులు, ఎగుమతిదారులు, పారిశ్రమల వ్యవస్థాపకులను బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నా రు. భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్యం గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు.ఉభయ దేశాల మధ్య కుదిరిన వాణిజ్యఒప్పందం పట్ల దేశవ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో తొమ్మిది అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు కుదరడం పట్ల ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. మనదేశం మొత్తం 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇది చరిత్రాత్మకం , ఒప్పందాలు కుదుర్చుకున్న మొత్తం 39 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుఅన్నారు.
దీనివల్ల దేశంలో వాణిజ్యపరంగా చక్కటి వాతావరణం నెలకొంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శివసేన ఎంపి మిలింద్ దేవర మాట్లాడుతూ, ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాలకోసమే పని చేస్తుందని, వాణిజ్యం ఒప్పంద అయినా, బడ్జెట్ అయినా, ప్రధాని మోదీ ఎంపీలకు స్వయంగా వివరించడం గొప్ప నిర్ణయం అన్నారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వాణిజ్య ఒప్పందాలపై విసృ్తతస్థాయిలో చర్చించినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్ ను స్వాగతించారు. పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికైన ఆయనను అభినందించారు. ప్రజా సంక్షేమం, స్నేహ పూర్వక విధానాలు, కార్యకర్తల కృషి ఫలితంగా ఎన్డీఏ మిత్రపక్షాలు వివిధ ఎన్నికలలో విజయం సాధిస్తున్నారని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. స్థానిక సంస్థలతో సహా వివిధ ఎన్నికలలో విజయం తో సంతృప్తి చెందరాదని, క్షేత్ర స్థాయిలో గట్టి కృషి చేయాలని ప్రధాని ఎంపీలను కోరారు. ప్రజా సంక్షేమ పథకాలు, క్షేత్ర స్థాయిలో కృషి వల్లనే ఈ విజయాలు లభించాయని గుర్తెరిగి మసులు కోవాలన్నారు మోదీ.
భారతదేశం ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు,, వికసిత్ భారత్ దార్శనికత తో దేశాన్ని ప్రగతిమార్గంలో తీసుకువెళ్ల డానికి ఎన్డీఏ అన్నిపక్షాలు నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు జేడీ(ఎస్) నాయకుడు, కేంద్రమంత్రి హెచ్ డి కుమారస్వామి అన్నారు. ఎల్ జేపి(ఆర్ వి) నాయకుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ ఎన్డీఏ సమావేశంలో సాధారణ బడ్జెట్ పై కూడా చర్చించామని, దీనిని దేశ ప్రజల్లో అత్యధికులు ప్రశంసించారని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ, టీడీపీ , జెడి(యు), జెడి(ఎస్) శివసేన, ఎల్ జేపి (ఆర్) సభ్యులు ఎన్డీఏకు చెందిన వివిధ నియోజకవర్గాల ఎంపీలు పాల్గొన్నారు.