
మన తెలంగాణ/హైదరాబా:మున్సిపల్ ఎన్నిక ల్లో విపక్షాల వ్యూహాలకు ధీటుగా ఎదుర్కొంటూ ఏడు కార్పొరేషన్లను, మెజారిటీ మున్సిపల్ చైర్మ న్ల పదవులనూ కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన మంత్రులు, ముఖ్య నేతల కీలక సమావేశంలో నిర్ణయించారు. విపక్షాల వ్యూహాలను ఎక్కడికక్క డ ఎదుర్కొవాలని ముఖ్యమంత్రి అన్నారు. ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సా యంత్రం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ తలెత్తిన రెబెల్స్ బెడద అంశంపై చర్చించారు. ఈ రెబెల్స్‌ను బుజ్జగించడంలో లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేయకుండా నిరోధించడంలో ఎందుకు విఫలమయ్యారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయాలని, లేనిపక్షంలో విపక్షాలకు మేలు జరుగుతుందని ఆయ న ఆందోళన వ్యక్తం చేశారు.’ బుధవారం నుంచి ముఖ్యమంత్రి మిర్యాలగూడ నుంచి విస్తృతంగా చేపట్టనున్న పర్యటన సందర్భంగా జనసమీకరణ గురించి కూడా వారు చర్చించారు. అనేక స్థానా ల్లో బిఆర్‌ఎస్ కంటే బిజెపితోనే పోటీ ఉండే అవకాశం ఉందని ఇరువురు మంత్రులు సమావేశం లో ప్రస్తావించినట్లుతెలిసింది. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన, హార్వర్డ్ యూనివర్సిటీకి విద్యార్థిగా వెళ్ళిన అనుభూతుల గురించి మంత్రులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులంతా ముఖ్యమంత్రిని అభినందించారు. ఇదిలాఉండగా సమావేశానంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తొంబై శాతం మున్సిపల్ చైర్మన్ పదవులను, ఏడు కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నదని ధీమాగా చెప్పారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి లేవదీసిన అభ్యంతరాలు, ఇంకా పలు జిల్లాల్లో వివాదాలు వచ్చిన విషయాల గురించి విలేకరులు ప్రశ్నించగా, జగిత్యాల, గద్వాల ఒకటి, రెండు చోట్ల తప్ప ఎక్కడా సమస్య లేదన్నారు. జీవన్ రెడ్డి మనోభావాలను అర్థం చేసుకున్నామని, ఆయనతో మాట్లాడుతానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. చిన్న సమస్యలన్నీ బుధవారం పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు.