
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు లక్షల ఉ ద్యోగాలు మొదటి ఏడాదిలోనే అని ఇచ్చిన మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారి లో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అ ని, పిసిసి చీఫ్‌తో సిఎం పలికిస్తున్న చిలుక ప లుకులు చూసి యువతరం ఛీకొడుతోందని విమర్శించారు. తొలి సంవత్సరమే రెండు లక్షల ని యామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కెసిఆర్ హ యాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజు లు కొట్టిన సిఎం,
ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో రిక్రూట్‌మెంట్ జీరో గా మారిపోయిందని పేర్కొన్నారు. అప్పటికే ల క్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్‌రెడ్డి చల్లిన బు రద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయిందని చెప్పా రు. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దు మ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని వ్యా ఖ్యానించారు. ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన ప్రజలు ఊరుకుంటారని అనుకుంటే అది పొరపాటే అని హెచ్చరించారు.