
మన తెలంగాణ/గోషామహల్: దక్షిణాదిలోనే ఖ్యాతిగాంచిన తపాలా శాఖకు కేంద్ర బిందువైన ప్రధాన కార్యాలయంలో నకిలీ క్యాజువల్ కార్మికుల జీ త భ త్యాలను కైంకర్యం చేసిన ఓ ఘరానా అధికారి నిర్వాకమిది. నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే తపాలా శాఖలో అరకోటికి పైగా అవినీతి చోటు చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. క్యాజువల్ కార్మికుల జీతాల పేరిట అరకోటికి పైగా ఎగనామం పెట్టిన అవినీతి అధికారికి అండగా నిలవడంతో పాటు పదోన్నతి కల్పించి అందలమెక్కించిన ఘనత తపాలా శాఖ అధికారులకు దక్కింది. తపాలా శాఖ హైదరాబాద్ సా ర్టింగ్ డివిజన్‌లో చోటు చే సుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తపాలా శాఖలో సదరు అధికారిపై అనేక ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్ధితుల్లో విచారణ కమిటీ వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. తపాలా శాఖలో క్యా జువల్ కార్మికుల బకాయిల చెల్లింపులో అవినీతి జరిగిందని కమిటీ తేల్చి నా, చర్యలు తీసుకునేందుకు తపాలశాఖ ఉన్నతాధికారులే జంకుతున్నారని కింది స్థాయి ఉద్యోగులు చెవులు కొరు క్కుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్‌లో సాధారణ పోస్టల్ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే తనపై అధికారులతో సహా తపాలా శాఖనే శా సించే స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సర్కిల్‌లో పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బి అధికారి స్థా యికి ఎదిగారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్లలో వివిధ డివిజన్లలో పని చేస్తూ, అధికార దాహంతో అక్రమంగా అందినకాడికి దండుకున్నారు. సుమారు అరకోటికి పైగా ప్రభుత్వ ఖజానాను స్వాహా చేశారు. తపాలా శాఖలో ఆ యన చెప్పిందే వేదం..చేసిందే వైద్యం అన్నట్లుగా అతని హవా కొ నసాగుతుంది. ఆయన అవినీతి అక్రమాలకు అంతే లేదు. అతనిపై చర్యలకు తపా లా శాఖ ఉన్నతాధికారులే జంకు తున్నారంటే ఆయన లెవల్ ఏపా టిదో ఇట్టే అర్దం చేసుకోవచ్చు. పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బి అధికారిగా పనిచేసిన సదరు అధికారి, తన డివిజన్ పరిధిలో కార్యాలయాలకు కావాల్సిన సాంకేతిక స్టేషనరీ సామగ్రి కొ నుగోలు చేసినట్లు కాగితాలపై చూపించి, సదరు కార్యాలయాలకు సామగ్రిని సరఫరా చేయకుండా తన సొంత ఖజానాకు తరలించుకున్నారన్న ఆరో పణలు గుప్పుమంటున్నాయి.
హైదరాబాద్ సార్టింగ్ డివిజన్‌లో సీనియర్ సూపరింటెంటెండ్ గా పని చేసిన కాలంలో 223 మంది క్యాజువల్ కార్మికుల జీత భత్యాల బకాయిలకు సంబంధించి తపాలా శాఖకు చెందిన సుమారు అరకోటికి పైగా నిధులను దారి మళ్లీంచారు. 223 మంది క్యాజువల్ కార్మికుల్లో 19 మందికి డీపీసీ చేయకుండా అక్రమంగా గ్రామీణ డాక్ సేవక్‌లుగా పదోన్నతి కల్పి ంచి, వారితో క్యాజువల్ కార్మికులుగా, గ్రామీణ డాక్ సేవక్‌లుగా పని చేయించి, ఫోర్జరీ పత్రాలతో 19 మంది జీత భత్యాలను అక్రమంగా స్వాహా చే శారని స్పెషల్ ఆడిట్ రిపోర్టులో ఆడిట్ అధికారులు నిర్దారించారు. అయినప్పటికీ సదరు అధికారిపై తపాలా శాఖ ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.
ఉన్నతాధికారుల అండదండలు…
తపాలా శాఖలో సదరు అధికారి లక్షల్లో నిధులు దారి మళ్లించారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తపాలా శాఖ ఉన్నతాధికారులు విచారణ నిమిత్తం త్రి సభ్య కమిటీని నియమించారు. ఈ కమిటి శాఖాపరమైన (అంతర్గత) ఆడిట్ వివరాల సమగ్ర విచారణ చేపట్టి, క్యాజువల్ కార్మికుల బకాయిల చెల్లిం పులో అవకతవకలు జరిగాయని, తపాలా శాఖకు చెందిన దాదాపు రూ. 52 లక్షల నగదు చెల్లింపుల్లో అవకతవకలు, అవినీతి జరిగిందని తేల్చింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. తపాలా శాఖ నిధులను తమలపాకులా కైంకర్యం చేసినప్పటికీ సదరు అధికారి తపాలా శాఖ లో దర్జాగా విధులు వెలగ బెడుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఖజానాను అక్రమంగా కొల్లగొట్టి, తపాలా శాఖను ముంచేసిన సదరు అధికారిపై చర్య లు చేపట్టాల్సిన ఉన్నతాధికారులు సదరు అధికారికి పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ = ఏ అధికారిగా పదోన్నతి కల్పించడం విడ్డూరంగా ఉందని తపాలాశాఖ అధికారులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా తపాలా శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకుని, తపాలా శాఖ లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.