
బీబీనగర్ మండల పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిని అన్ని హంగులతో తీర్చిదిద్ధి యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుపనున్నట్లు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళవారం డైరెక్టర్ అమిత అగర్వాల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సదుపాయాలు,భవన నిర్మాణ పనులు పురోగతిపై ఎయిమ్స్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఎయిమ్స్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయామని ఆయన అన్నారు.గతంలో భవన నిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించారని వాటిని రీ మార్కింగ్ చేసి మరల నిర్మాణ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆసుపత్రి భవన నిర్మాణాలతోపాటు వైద్య విద్యార్థుల వసతి గృహాలు సరికొత్తగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 86% పనులు పూర్తయ్యాయని అత్యంత ప్రతిష్టాత్మకంగా 24 అంతస్థుల భవనాలను నిర్మించి వైద్య విద్యార్థుల వసతి గృహాలకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో 15 లక్షల మంది వైద్యసేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రక్కన ఆసుపత్రి నిర్మాణం జరుగుతూనే మరోపక్క వైద్య సేవలు అందిస్తూ రోజుకు 1800 మంది ఓపికి చికిత్స పొందే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతం సెమి రూరల్ కాకుండా సెమి అర్బన్ లా ఉంటుంది కాబట్టి పేషంట్లతో వచ్చే సహాయకులకు సరైన ఆకామినేషన్ అందుబాటులో లేదు కాబట్టి ప్రయివేట్ సంస్థలు ముందుకు వచ్చి భవనాలను నిర్మించి మెయింటైన్ చేస్తామంటే ప్రభుత్వం తరుపున ఆలోచిస్తామని ఆయన తెలిపారు.
బీబీనగర్ ఎయిమ్స్ లో ఇప్పటికే రెండు బ్యాచ్ లు ఎంబీబీఎస్ విద్యార్థులు పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని పట్టాలు తీసుకొని బయటకు వెళ్లారని బిఎస్సి నర్సింగ్,ఎమెస్సి నర్సింగ్ విద్యార్థులు సుమారు 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి హైద్రాబాద్ సిటి ఔటర్ రింగ్ రోడ్డు కు బయట రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికి ఎయిమ్స్ ఆసుపత్రి సౌకర్యంగా ఉపయోగకరంగ ఉంటుందని అయన అన్నారు.హైదరాబాద్ నగరంలో అనేక రకాల ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ రోజు గ్రామీణ ప్రాంతాల ప్రజానీకానికి హైదరాబాద్ నగరంతో సహా అందుబాటులో ఉండే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, బీజేపీ బీబీనగర్ మండల అధ్యక్షులు భువనగిరి సదానంద్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,కాసుల శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఇంజమూరి ప్రభాకర్, బోయపల్లి గోపాల్ రెడ్డి,పశులాది రాంచందర్,కొలను లక్ష్మ రెడ్డి, పొట్ట నవీన్, దాసమోని వెంకటేష్, పంజాల ప్రవీణ్, నక్కీర్తి శ్రీకాంత్, జల్లి సాయి దత్త,బాను తదితరులు పాల్గొన్నారు.