
బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ మరోసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్, డైరెక్టర్ వినోద్ అనంతోజు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తక్షకుడు అనే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఫ్రెష్ గా, ఆసక్తికరంగా ఉంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ను రూపొందించారు. అయితే, థియేటర్లలో కాకుడా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లాపతా లేడీస్ మూవీ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు.
కాగా, ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బేబి తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి మరోసారి ఆనంద్ నటిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఎపిక్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.