
తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినో ద్‌లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి, కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి..కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసిఅడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్ప డినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు.
విద్యార్థి సంఘ నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదుతో…
విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్‌తో పా టు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్ల డిం చారు. నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద (క్రైం నెంబర్: 23/2026)కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఎ1గా సతీష్, ఎ2గా మోహన్ బాబు, ఎ3గా మంచు విష్ణుబాబుపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితు లతో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆరోపణ
మోహన్ బాబు యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయా లని విద్యార్థి సంఘాలు గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తు న్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై ఎంబీయూ నుంచి ఎవరూ ఇంకా స్పందించలేదు.