
మణిపూర్‌లో దాదాపు ఏడాదిగా అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అయ్యింది. మంగళవారంనాడు సమావేశమైన బిజెపి శాసనసభాపక్షం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది. డిప్యూటీ సిఎంగా మహిళ నాయకురాలు నెమ్చా కిప్జెన్‌కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మణిపూర్ అసెంబ్లీ కాలపరమితి 2027వరకు ఉంది. అంటే కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వం ఏడాది పాటు పాలన సాగిస్తుంది. కొంత కాలంగా జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గత ఏడాది బీరేన్ సింగ్ సిఎం పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. తాజాగా ఖేమ్‌చంద్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.