
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ’దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్న వేళ ‘దేవర’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్-2 షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ నుంచి
ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభించడానికి కొరటాల శివ కసరత్తులు చేస్తున్నాడట. దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ పార్ట్-2 కోసం మ్యూజిక్ పై వర్క్ చేస్తున్నాడట. అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ దేవర 1 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో అందుకుంటుందో చూడాలి.