
ఆంక్షలు ఎత్తివేస్తే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లు
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టారని విపక్షం నుంచి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భగం వాటిల్లలేదని, పైగా మరింత పరిరక్షించబడ్డాయని మంగళవారం ఒక ప్రకటలో కేంద్రం వెల్లడించింది.
సున్నితమైన రంగాలైన వ్యవసాయం, డెయిరీ తదితర అనుబంధ రంగాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని, సంప్రదింపుల సమయంలోనూ ఎలాంటి రాజీ కుదుర్చుకోలేదని తెలిపాయి. వివిధ రంగాల్లో ప్రభుత్వ స్థిరత్వానికి చర్చలు అద్దం పట్టాయని, ఇంధన రంగంలో కూడా భారత్ ప్రయోజనాలే కీలకంగా సంప్రదింపులు జరిగాయని ఆ ప్రకటనలో వెలువరించారు. వెనెజువెలా సహా ఆంక్షలు ఉన్న ఏ దేశం నుంచి కూడా చమురు కొనుగోళ్లు ఉండబోవని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఒకవేళ ఆంక్షలను ఎత్తివేసే తప్పకుండా చమురు దిగుమతి చేసుకుంటామని తెలిపింది.