Reading Time: < 1 minute

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్‌న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదన్నారు. భారత్ మాకు అత్యంత ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది.