Reading Time: < 1 minute

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అకస్మాత్తుగా జరగడంపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒప్పందానికి సంబంధించిన సమగ్ర వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, రైతుల రకాన్ని, వాళ్లు చిందించే చెమటను, దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపణ చేశారు. తన ప్రాబల్యం ఎక్కడ దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారంనాడు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ వణికిపోతున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ అనూహ్యంగా సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.

ట్రేడ్ డీల్ విషయంలో రాజీపడ్డారు. ఇంతవరకూ కాపడుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీపై అమెరికాలో కేసు ఉందని, నిజానికి ఒకరకంగా ఇది మోడీపై కేసు అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చాలా విషయాలున్నాయని, దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఆ ఒత్తిడి కూడా ఉందని, ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవేనని అన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవరణే అంశాన్ని సైడ్ చేయడానికి ఇదో కొత్త డ్రామా అని అన్నారు. రైతులు ఇలాంటి ఒప్పందాలపై ఓ కన్నేయాలని, వాటిని అర్థం చేసుకోవాలన్నారు.