
మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.350+ కోట్ల వసూళ్లు సాధించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఒటిటి రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు తెరపడింది.
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒటిటి విడుదలపై ప్రకటన వచ్చింది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘జీ5’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో మెగాస్టార్‌కి ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఇన్ని భాషల్లో సినిమాను ఒటిటిలో ప్రసారం చేస్తున్నారు. అయితే ఒటిటి రిలీజ్ డేట్‌ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ సినిమా ఒటిటిలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది.