Reading Time: < 1 minute

హైదరాబాద్: రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు పాతరేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సుగ్గుగా ముఖం చాటేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారని, ఇప్పుడేమో అది ఐదేళ్ల హామీ అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరుస కుంభకోణాలతో జేబులు నింపుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి ద్రోహం చేశారని కెటిఆర్ ధ్వజమెత్తారు.