
నల్గొండ: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చిన కారు యజమానిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కేంద్రం నుండి ఇమ్రాన్ అనే వ్యక్తి వ్యక్తిగత పని నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరాడు. మార్గమధ్యలో నార్కెట్‌పల్లి వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగ్గా ఇమ్రాన్ అతడిని కారులో ఎక్కించుకున్నాడు.
చిట్యాల సమీపానికి చేరుకోగానే, ఇమ్రాన్ మెడ, శరీరంపై కత్తితో దాడి చేసి, అతని సెల్ ఫోన్ మరియు నగదు లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ ప్రతిఘటించడంతో, భయంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఇమ్రాన్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.