
అమరావతి: అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయి అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. అమెరికాతో చారిత్రక ఒప్పందం ద్వారా దేశ యువత, రైతులకు అపారమైన అవకావశాలు లభిస్తాయని అన్నారు. ఒప్పందం విజయవంతంగా పూర్తి చేసిన ప్రధాని నరేంద్రమోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా 18 శాతం సుంకాల తగ్గింపు వల్ల..రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిరంతర గ్లోబల్ వృద్ధికి దోహదపడే దూరదృష్టి నిర్ణయమిదని, ప్రధాని నాయకత్వంలో భారత్ ఒక గ్లోబల్ ఆర్థిక శక్తిగా మరింత పటిష్టం కానుందని జోష్యం చెప్పారు. భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, మోడీ నాయకత్వంలో ఆర్థికశక్తి కేంద్రంగా భారత్ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.