Reading Time: < 1 minute

హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తుండగా బైకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బైకును కేబుల్ బ్రిడ్జిపైనే పక్కకు వాహనదారుడు ఆపడంతో ప్రమాదం తప్పింది. నిమిషాల్లోనే మంటల్లో బైకు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.