Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాక.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే త్వరలో ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది. ‘ధురంధర్-2.. ది రివేంజ్’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఆదిత్య ధర్. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తొలి భాగం కంటే మించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఇందులో ఉంటాయని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదల కాగా.. రెండో భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘‘ఇది కొత్త భారత దేశం.. సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి.. దెబ్బ కొట్టి తీరుతుంది’’ అంటూ ఆఖర్లో వచ్చే డైలాగ్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఈ వేసవికాలంలో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.