Reading Time: < 1 minute

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తల్లికి ఉన్న వైకల్యం వల్ల తనకు వివాహం జరగడం లేదని హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి నీటిపై తేలుతూ లభ్యమైన మృతదేహం లభ్యమైంది. కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి(26)కూకట్ పల్లి పరిధిలోని మైత్రి నగర్‌లో మతిస్థిమితం సరిగ్గా లేని తన తల్లితో ఉంటూ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవల వివాహ సంబంధాలు రాగా.. మతిస్థిమితం లేని తన తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి నిబంధన పెట్టడంతో పెళ్లికి నిరాకరిస్తున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై శనివారం సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.