
భారత క్రికెటర్లు శిఖర్ ధవన్, చతేశ్వర్ పుజారాలు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు మాజీ క్రికెటర్లతో వరల్డ్ లెజెండ్స్ ప్రొ టీ20 లీగ్‌లో పుజారా, ధవన్‌లు పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్‌లో గురుగ్రామ్ థండర్ తరఫునఆడుతున్న పుజారా దుబాయ్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా 60 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 99 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు విఖర్ ధవన్ కూడా చెలరేగిపోయాడు
మంగళవారం మహారాష్ట్ర టైకూన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ రాయల్స్ తరఫున శిఖర్ ధవన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధవన్, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.