
ప్రపంచ ప్రఖ్యాత సూపర్‌స్టార్‌లలో ‘పాప్ రారాజు’ మైఖేల్ జాక్సన్ ముందు వరుసలో ఉంటారు. కొన్ని దశాబ్ధాల పాటు ఆయన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించారు. 2009లో మైఖేల్ ఈ లోకాన్ని వీడిన తర్వాత ఆయన వారసత్వాన్ని ఎవరూ కొనసాగించలేదు. అయితే మైఖేల్ జాక్సన్ బయోపిక్ వస్తుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. ‘మైఖేల్’ పేరుతో పాప్ కింగ్ బయోపిక్ రాబోతుంది. ఇందులో ప్రధాన పాత్రలో మైఖేల్ మేనల్లుడు జాఫర్ నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. మైఖేల్ మరణించిన 16 సంవత్సరాలకి ఈ బయోపిక్ వస్తోంది. ఆయన బాల్యం నుంచి సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగారు అనేది ఈ బయోపిక్‌లో చూపించారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం దాదాపు రూ.10 వేల కోట్ల వరకూ బిజినెస్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మైఖేల్‌కు 400 కోట్లకు పైగానే అభిమానులు ఉన్నారని ఓ అంచనా ఉంది.