Reading Time: < 1 minute

తాడిచర్ల -1 బొగ్గు గునుల కేటాయింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ గనులను తెలంగాణకు కేటాయించామని సోమవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థకు కేటాయించామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగి ప్రశ్నకు బదులిచ్చిన కిషన్ రెడ్డి 2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం తర్వాత 2020 జూన్ నుంచి గనుల కేటాయింపుల ప్రక్రియ మారిందని తెలిపారు. వ్యాపారానికి వాడే గనులను వేలంలో కేటాయించాలని కమిటీ సూచించిందని, ప్రత్యేక,

తప్పని పరిస్థితుల్లోనే బొగ్గు శాఖ నేరుగా కేటాయించాలని కమిటీ తెలిపిందన్నారు. తాడిచర్ల-2 గనులు ఇంకా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. కాగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్‌కోకు కేటాయించారు. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకువస్తే వారితో ‘మేం పనిచేయలేమని బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని ఇటీవల కిషన్ రెడ్డి విమర్శించారు. నేడు సుమారు రూ.47వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడింది. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీకి కూడా ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవని వ్యాఖ్యానించారు.