Reading Time: < 1 minute

నవీ ముంబై: అమెరికాతో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇండియాఎ టీమ్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్‌కప్ సన్నాహాల్లో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 55 బంతుల్లోనే (104) పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ బడోని 26 బంతుల్లో అజేయంగా (60), తిలక్‌వర్మ 24 బంతుల్లో 38 పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.