
వాషింగ్టన్: అణు కార్యక్రమంపై ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో తాము తేల్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించారు.
తమపై ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించి రెండు రోజుల్లో ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నానని, ఒకవేళ కుదరకపోతే ఖమేనీ చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు అక్కడ చాలా దగ్గరలో ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు.