
యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సిని మా ‘భగవంతుడు‘. ఈ సినిమా లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ నిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్1 గా నిర్మిస్తున్నారు రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘భగవంతుడు‘ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను హీరోలు విశ్వ క్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదు గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి”అని అన్నారు. డైరెక్టర్ జి.జి. విహారి మాట్లాడుతూ “పల్నాడు యుద్ధాన్ని తెలుగు మహాభారతం అంటారు. వెయ్యేళ్ల కిందటే మన సమాజంలోని అంతరాలకు సమాధానం పల్నాడులో చెప్పడం జరిగింది. అందుకే ఈ సినిమాకు పల్నాడు బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాను”అని తెలిపారు. ప్రొడ్యూసర్ రవి పనస మాట్లాడుతూ ఏప్రిల్ లో ‘భగవంతుడు‘మూవీని రిలీజ్ చేయాలని ప్లా నింగ్‌లో ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేణు ఊడుగుల, మధుర శ్రీధర్‌రెడ్డి, తి రువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, సెవెన్ హి ల్స్ సతీష్, క్రిష్, జబర్దస్త్ అభి, రవీందర్ విజయ్, మైమ్ మధు, కేపీ పాల్గొన్నారు.