
ముంబై: విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణంతో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అజిత్ మరణంతో రాష్ట్ర డిప్యూటీ సిఎం పోస్ట్ ఖాలీ ఏర్పడింది. అయితే, ఈ పదవిని అజిత్ భార్య సునేత్ర పవార్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం సునేత్ర పవార్.. రాష్ట్ర డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి ముందు, ఎన్‌సిపి శాసనసభ పక్ష సమావేశం జరగాల్సి ఉంది. అదే సమయంలో ఎన్‌సిపిలోని రెండు వర్గాల పునరేకీకరణపై చర్చలు మరోసారి ఊపందుకున్నాయి.
కాగా, అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె డిప్యూటీ సిఎం పదవిని చేపడితే.. రాజ్యసభ స్థానానికి కుమారుడు పార్థ్ పవార్‌ను పంపించే అవకాశం ఉన్నట్లు ఎన్‌సిపి వర్గాల చెబుతున్నాయి.