Reading Time: < 1 minute

మనతెంలగాణ/హైదరాబాద్ : టిజి టెట్ 2026(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ప్రాథమిక కీ విడుదలైంది. టిజి టెట్ కీ తోపాటు రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వ రకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు న వీన్ నికోలస్ పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, టెట్ పరీక్షలకు 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా, 1,95,181 మంది(82.09 శాతం) హాజరయ్యారు. 42,573 మంది అ భ్యర్థులు టెట్ పరీక్షలకు గైర్హాజయ్యారు. టెట్‌కు 1,65,081 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, 65,605 మంది(90.27 శాతం) హాజరయ్యారు