Reading Time: < 1 minute

కర్ణాటకలోని మైసూరులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఎన్‌సిబి అధికారులు ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో తనిఖీలు నిర్వహించి రూ.10 కోట్లు విలువ చేసే డ్రగ్స్, రూ.25.6 లక్షల నగదు, ఓ కారును సీజ్ చేశారు. అంతేకాక.. ల్యాబ్‌లో 500 కిలోల రసాయనాలను ఎన్‌సిబి అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.