Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : నిజాం నగలు రిజర్వ్ బ్యాంక్ వద్ద సురక్షితంగా ఉన్నాయని, వాటి చారిత్రక , సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి, అత్యధిక భద్రత మధ్య వాటిని ఉంచామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ వివరాలను లిఖిత పూర్వకంగా రాజ్యసభకు వెల్లడించారు.

నిజాం నగలను హైదరాబాద్‌లో ప్రజల సందర్శనకు ఉండే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన ఆభరణాలు 1995 నుంచి ఆర్‌బిఐ వాల్ట్ లోనే భద్రంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసా? అని కొందరు సభ్యులు ప్రశ్నించగా, ఆయన తెలుసునని బదులిచ్చారు. నిజాం పాలనలో ఉండే హైదరాబాద్ భూభాగం స్వాతంత్య్రం తరువాత భారత్‌లో విలీనమైంది.